చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2020-12-27T05:46:31+05:30 IST
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వానికి అన్నివిధాల సహకరించాలని శిక్షణ ఐపీఎస్ అధికారి ఆక్షాంశ్ యాదవ్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి అన్నారు.

ఇచ్చోడ రూరల్, డిసెంబరు 26: ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వానికి అన్నివిధాల సహకరించాలని శిక్షణ ఐపీఎస్ అధికారి ఆక్షాంశ్ యాదవ్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి అన్నారు. మండలంలోని బోరిగావ్ గ్రామంలో చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడు తూ సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చట్టాలను గౌరవించాలన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుంధతి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు కుంట సురేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.