అనుమానాస్పద స్థితిలో కౌలు రైతు మృతి
ABN , First Publish Date - 2020-03-08T12:30:58+05:30 IST
శనగ పంట కాపలాగా వెళ్లిన ఓ కౌలు రైతు శుక్రవారం అర్ధరాత్రి పంట చేనులోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందా డు.

ఇచ్చోడ రూరల్, మార్చి7: శనగ పంట కాపలాగా వెళ్లిన ఓ కౌలు రైతు శుక్రవారం అర్ధరాత్రి పంట చేనులోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందా డు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని చించోలి గ్రామ శి వారులో చోటుచేసుకుంది. ఎస్సై జి.పుల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వేగం గ్రామానికి చెందిన కాగ్నే భీమ్రావ్ (60) ప్రతీరోజు రాత్రి చించోలి గ్రా మ శివారులోని కౌలుకు తీసుకున్న చేనులో శనగ పంట కాపలాగా వెళ్తు న్నాడు. రోజులాగే శుక్రవారం రాత్రి కూడా వెళ్లాడు.
శనివారం ఉదయం ఆ చేను గుండా వెళ్లే గ్రామస్థులకు పడిపోయి ఉన్న భీమ్రావ్‌ను గమనించి కు టుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు, రక్త పోటు, బీపీతోనే చనిపోయి ఉండొచ్చని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. మృతుడికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.