సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T10:40:08+05:30 IST

ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అన్నారు. గురువారం స్థానిక గాంధీచౌక్‌లో వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున మంజూరైన

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌


కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 12: ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అన్నారు. గురువారం స్థానిక గాంధీచౌక్‌లో వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వీధి వ్యాపారులకు ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేస్తున్నాయన్నారు. కమీషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రూ.10వేల చొప్పున 80 మందికి రూ.8 లక్షల రూపాయల చెక్కులు మెప్మా ఆధ్వర్యంలో అందజేశామన్నారు. అనంతరం కోవిడ్‌-19 నేపథ్యంలో వీఽధి విక్రయదారులకు హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎల్‌డిఎం చెంచు రామయ్య, వైస్‌ చైర్మన్‌ గిరీష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T10:40:08+05:30 IST