అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

ABN , First Publish Date - 2020-10-28T11:35:55+05:30 IST

తనను అవినీతిపరునిగా చిత్రీకరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు దానిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయా ల్లో నుంచి తప్పుకుంటానని, నిరూపించని పక్షంలో ఆయన తప్పుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ పెంట

అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య


మంచిర్యాల, అక్టోబరు 27: తనను అవినీతిపరునిగా చిత్రీకరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు దానిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయా ల్లో నుంచి తప్పుకుంటానని, నిరూపించని పక్షంలో ఆయన తప్పుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య సవాలు విసిరారు. ఎమ్మెల్యే నివాసం వద్ద  మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోసం దుర్మార్గమైన ఆలోచనలు తెరపైకి తెస్తున్నారని, మున్సిపల్‌ ఆటోల్లో అవినీతి జరిగిందనడం అవాస్తవమన్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ నిర్మించిన ఇల్లే అవినీతి కూపమని, ఇత రులను విమర్శించే ముందు ఆలోచించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు,  కౌన్సిలర్‌ గాదె సత్యం మాట్లాడుతూ రాంనగర్‌ పార్కులో ప్రజల కోరిక మేరకే భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలు భవనం వద్దంటే నిర్మాణాన్ని నిలిపివేస్తామని, ఈ విషయమై కోర్టుదాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.  నడిపెల్లి ట్రస్టు చైర్మన్‌ విజిత్‌కుమార్‌,  కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు,  సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌, ఎర్రం తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T11:35:55+05:30 IST