వైద్య సేవలపై మున్సిపల్‌ చైర్మన్‌ ఆరా

ABN , First Publish Date - 2020-07-22T10:34:34+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య ఆరా తీశారు.

వైద్య సేవలపై మున్సిపల్‌ చైర్మన్‌ ఆరా

మంచిర్యాల టౌన్‌, జూలై 21: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య ఆరా తీశారు. మంగళవారం ఆసుపత్రిని వైస్‌ చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌, నడిపెల్లి ట్రస్టు చైర్మన్‌ విజిత్‌కుమార్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రీజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసుల విషయంతో తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు.  గాదె సత్యం, గొంగళ్ల శంకర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-07-22T10:34:34+05:30 IST