గ్రేటర్ ఎన్నికలతోనైనా బుద్ధి రావాలి
ABN , First Publish Date - 2020-12-06T06:58:28+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చి న తీర్పుతోనైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు.

ఎంపీ సోయం బాపురావు ధ్వజం
ఆదిలాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చి న తీర్పుతోనైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ జెండా ఎగుర వేస్తామన్నారు. గ్రేటర్ ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు ఈ ఫలితాలు చెంపదెబ్బలాంటివని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ పొత్తుపెట్టుకొని ప్రజల ను మోసగించారని ఆరోపించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సక్రమంగా లేకపోవడంతోనే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠమే చెప్పారని దుబ్బాక ఉప ఎన్నికల పలితాలతో టీఆర్‌ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జిల్లా నుంచి పని చేసిన నేతలకు, కార్యకర్తలకు ఎంపీ సోయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు.
పోరాట యోధులే స్ఫూర్తిగా ముందుకు..
గుడిహత్నూర్: ఆదివాసీలు తమ హక్కుల సాధనకై పోరాట యోధుల ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో వెడ్మ రాము 33వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ముందుగా ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి వెడ్మ రాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొమురంభీం, కొమురంసూ రు, బీర్సాముండా లాంటి ఉద్యమకారులతో కలిసి తోటి సమాజానికి చెంది న రాము కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ బిర్డుగోండ్ తోటి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్సకోల తిరుపతి, పెసా చట్టం కో ఆర్డినేటర్ వెడ్మబొజ్జు, జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్, తోషం సర్పంచ్ సోయం దస్రుపటేల్, తోటి సంఘం నాయకులు పాల్గొన్నారు.