లంబాడాలను తొలగించేందుకు ఉద్యమం

ABN , First Publish Date - 2020-12-30T06:24:07+05:30 IST

ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపురావు అన్నారు.

లంబాడాలను తొలగించేందుకు ఉద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

ఎంపీ సోయం బాపురావు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 29 : ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపురావు అన్నారు. మంగళవారం టీఎన్‌జీఓ భవనంలో జరిగిన తుడుందెబ్బ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఎంపీ హాజరై ప్రసంగించారు. ఆదివాసులు సాగుచేస్తున్న భూ ముల విషయంలో అటవీశాఖ అధికారులు దాడి చేస్తే ప్రత్యక్షదాడులకు వెనకాడమన్నారు. కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదన్నారు. తనపై ఎన్ని కేసులు బనాయించిన భయపడబోనన్నారు. జీఓ 3ను సీఎం కేసీఆర్‌ కుట్రతోనే అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆదివాసీలకు కనీస సౌకర్యాలైన రోడ్డు, విద్యుత్‌ కల్పించకుండా వివక్షచూపుతుందన్నారు. వలస లంబాడాలను తొలగిస్తేనే గిరిజనగూడెలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయన్నారు. ఉద్యోగ ఉపాధి వర్గాల్లో అన్యాయం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి తమ భాధను వినిపిస్తామని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు వెంకగారి భూమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ సట్ల అశోక్‌తో పాటు నాయకులు పిట్ల రాజమూర్తి, ఆనంద్‌, మొసలి చిన్నయ్య, లక్ష్మణ్‌, సూరపు సాయన్న తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:24:07+05:30 IST