వాహనదారులు రోడ్డు నియమాలను పాటించాలి

ABN , First Publish Date - 2020-03-13T12:44:26+05:30 IST

వాహనదారులు రోడ్డు నియమాలను పాటించాలని భైంసారూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని

వాహనదారులు రోడ్డు నియమాలను పాటించాలి

భైంసా రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌


కుభీర్‌, మార్చి12: వాహనదారులు రోడ్డు నియమాలను పాటించాలని భైంసారూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని మాలేగాం గ్రామంలో వాహనదారులకు రోడ్డు భద్రత నియమ నిబంధనల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డుభద్రత నియమాలను పాటించి, గమ్యాన్ని సురక్షితంగా చేరాలని సూచించారు. అవగాహన రహిత్యంతో వా హనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వా హనాలు నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగు లైసెన్సు, సంబంధిత వాహన పత్రా లు కలిగి ఉండి నియమ, నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్టును పెట్టుకోవాలన్నారు.


మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో కోర్టు విధించే జరిమానాలు, శిక్షలను గ్రామస్థులకు తెలియజేశారు. అనంతరం మాలేగాం నుంచి సొనారి వరకు ఆర్‌అండ్‌బీ డీఈ రవీందర్‌ రెడ్డితో కలిసి రోడ్డు మూలమలుపులను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కృష్ణకల గంగారావు, వా ర్డు సభ్యులు, పోలీసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T12:44:26+05:30 IST