మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-31T05:20:16+05:30 IST
ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ బుధవారం మారుమూల గ్రామాలైన కర్ణంలొద్ది, రాయదారి, పోచంపల్లి తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

పెంబి, డిసెంబరు 30: ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ బుధవారం మారుమూల గ్రామాలైన కర్ణంలొద్ది, రాయదారి, పోచంపల్లి తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రాయదారి, పోచంపల్లిలో శేగ్రిగేషన్ షెడ్లను, విలేజ్ పార్క్‌లను ప్రారంభించి ప్రజలతో మమేకమై వారి సమస్య లు తెలుసుకున్నారు. మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణం పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీపీ వినోద్‌తో ఫోన్‌లో మాట్లాడి వెంటనే అనుమతులు ఇప్పించాలని కోరారు. రెండు రోజుల్లో క్లియరెన్స్ ఫైల్ పంపిస్తామని సీపీ వివరణ ఇచ్చారు. టవర్ ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించగా పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. కర్ణంలొద్ది గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, రైతుబంధు మండల కన్వీనర్ గోవింద్, మార్కె ట్ కమిటీ చైర్మన్ గంగ నర్సయ్య, ఎంపీడీవో సాయన్న, తహసీల్దార్ రాజ్‌మోహన్, నాయకులు ప్రదీప్, సురేష్, తదితరులు ఉన్నారు.