సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-12-07T06:23:13+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ పైపు లీకేజీలు, నల్లా కనెక్షన్ల పనితీరు గురించి ఆరా తీశారు. అదేవిధంగా ప్రజలు చెప్పిన సమస్యల ను వెంటనే పరిష్కరించాలని మిషన్‌ భగీరథకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా భగత్‌సింగ్‌నగర్‌లో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ పనుల గురించి, అందుకు సంబంధించిన అధికారులు సదరు పనుల ను త్వరగా పూర్తయ్యేందుకు కార్యచరణ చేపట్టాలని సూచించారు.కాలనీ వాసుల కు వారి వార్డులో ఉన్న సమస్యలను దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కాలనీలో నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు.

రూ.70లక్షలతో అదనపు భవన నిర్మాణానికి భూమిపూజ

జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న ఆదిలాబాద్‌ గ్రంథాలయంలో రూ.70 లక్షలతో చేపట్టే మొదటి అంతస్తు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమిపూజ చేశారు. అదేవిధంగా గ్రంథాలయ కాంప్లెక్స్‌కు అతి త్వరలో భూమి పూజ చేస్తామన్నారు.ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే, పట్టణంలోని హామాలీవాడలో రూ.15లక్షలతో చేపట్టే మిడిల్‌ లెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే జోగురామన్న భూమిపూజ చేశారు.గాంధీనగర్‌, రణదివ్యనగర్‌ హైలెవల్‌ బ్రిడ్జి పనులకు గాను రూ.కోటి 20లక్షలతో చేపట్టే పనులను ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. కాగా సదరు వార్డులలో స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఏళ్లుగా బ్రిడ్జి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కలలను నేరవేరుస్తూ సదరు బ్రిడ్జిల నిర్మాణాని కి భూమిపూజ చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో పాటు తిర్పెల్లిలో రూ. 10లక్షలతో చేపట్టే కమ్యూనిటీ హాల్‌, బ్రహ్మణ సమాజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో ప్రతి కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్‌ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత, బంగారుగూడ బీటీ రోడ్డు, సీసీ డ్రైన్‌ల నిర్మాణానికి గాను రూ.51 లక్షలతో చేపట్టే పనుల కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తునే ప్రతివాడ, గ్రామం అభివృద్ధి పథంలో ఉండేలా పనులు చేపడుతుందని అన్నారు. దేశంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ ప్రేమేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులున్నారు.

Updated Date - 2020-12-07T06:23:13+05:30 IST