ప్రజల దాహార్తి తీర్చేందుకే మిషన్‌ భగీరథ

ABN , First Publish Date - 2020-09-13T10:13:52+05:30 IST

ప్రజల దాహార్తి తీర్చేందుకే తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.

ప్రజల దాహార్తి తీర్చేందుకే మిషన్‌ భగీరథ

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు


మంచిర్యాల, సెప్టెంబరు 12: ప్రజల దాహార్తి తీర్చేందుకే తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 11, 27వ వార్డుల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు తాగునీరందించేందుకు స్థానిక జాలా గుట్టపై రూ. 53 కోట్లతో ప్రత్యేక పథకం చేపట్టామని చెప్పారు. పనులు పూర్తికాగానే నిరంతం మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు.


27వ వార్డులో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, వార్డు కౌన్సిలర్‌ సిరికొండ పద్మ కొండల్‌రావు, 5వ వార్డు కౌన్సిలర్‌ సుదమల్ల హరికృష్ణ, మాజీ కౌన్సిలర్‌ కల్వల జగన్‌మోహన్‌రావు, 11వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ జోగుల శ్రీలత సదానందం, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంకం నరేష్‌, 17వ వార్డు కౌన్సిలర్‌ పూదరి సునీత ప్రభాకర్‌తోపాటు కొండ చంద్రశేఖర్‌, శ్రీరాముల మల్లేష్‌, తాజ్‌ముల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T10:13:52+05:30 IST