గ్రామాల్లో మిషన్ భగీరథనీటిని ఉపయోగించాలి
ABN , First Publish Date - 2020-03-13T12:39:58+05:30 IST
గ్రామీణ ప్రజలు మిషన్ భగీరథ నీటిని ఉపయో గించేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) డీఈ నాగ

సిరికొండ, మార్చి12: గ్రామీణ ప్రజలు మిషన్ భగీరథ నీటిని ఉపయో గించేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) డీఈ నాగ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ మి షన్ భగీరథ ద్వారా ప్రజలకు శుద్ధ నీరు సరఫరా చేస్తామని, దీనిపై ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు.
మండలంలో మిషన్ భగీరథ పనులు త్వ రితగతిన పూర్తి చేస్తామని, పనులు పూర్తయ్యేందుకు సర్పంచ్‌లు, పంచాయ తీ కార్యదర్శులు సహరించాలని ఆయన కోరారు. ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించేలా గ్రామాల్లో ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. గతంలో గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు లబ్ధి దారులకు పూర్తిగా చెల్లింపులు జరుగలేదని, వాటి బిల్లులు వెంటనే చెల్లించాల ని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కోరగా ప్రభుత్వానికి నివేదించి పెం డింగ్ బిళ్లులు చెల్లించేలా ప్రయత్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణయ్య, ఎంపీవో అతుల్‌కుమార్, మండల అద్యక్షులు పెందూర్ అమృ త్‌రావు, ఉపాధిహామీ ఏపీఎం సుభాష్, వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.