కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంత్రి అల్లోల పూజలు

ABN , First Publish Date - 2020-12-11T05:48:50+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం ప్రత్యేకపూజలు నిర్వహించారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంత్రి అల్లోల పూజలు
బంగారు మీసాలను సమర్పిస్తున్న మంత్రి అల్లోల దంపతులు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 10 : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. సతీసమేతంగా మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. మల్లన్న స్వామికి బంగారుమీసాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు ఆలయమర్యాదలతో మంత్రి అల్లోలకు స్వాగతం పలికారు. వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. 50గ్రాముల బంగారుమీసాలు మంత్రి సమర్పించగా స్వామి కి అలంకరించారు. 

Updated Date - 2020-12-11T05:48:50+05:30 IST