నేడు నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-12-20T13:59:30+05:30 IST
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు.

నిర్మల్: అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చించొలిలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని మంత్రి ప్రారంభిచనున్నారు. అలాగే గండి రామన్న హరితవనంలో మూషిక జింకల పార్కును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించబోతున్నారు. జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.