క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి ఐకేరెడ్డి

ABN , First Publish Date - 2020-12-03T06:10:26+05:30 IST

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పీఏ స్వర్గీయ మధు సూదన్‌ స్మారక క్రికెట్‌ పోటీలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో బ్యాటింగ్‌ చేసి ప్రారం భించారు.

క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి ఐకేరెడ్డి
బ్యాటింగ్‌ చేస్తున్న మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 2 : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పీఏ స్వర్గీయ మధు సూదన్‌ స్మారక క్రికెట్‌ పోటీలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో బ్యాటింగ్‌ చేసి ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ క్రీడలు శరీరధారుడ్యం మాన సిక ఆరోగ్యం పెంపొందిస్తాయన్నారు. పోటీ తత్వంతో ప్రతిభ కనబర్చేందుకు క్రీడాకారులు ప్రయత్నించాలని తద్వారా విజయం సమ కూరుతుందని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, నాయకులు రాం కిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణ సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన నూతన డీపీఆర్‌వో

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 2 : నిర్మల్‌ జిల్లా నూతన సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిణి బి. తిరుమల బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మర్యాద పూర్వకంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,  కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీని కలిసి పూలబొకే అందించారు. 

‘ఆలయాభివృద్ధికి సహకరించండి’

కుంటాల, డిసెంబరు 2 : హనుమాన్‌ ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతూ లింబా(కే) సర్పంచ్‌ ఆనంద్‌రావుపటేల్‌, ఆత్మ చైర్మన్‌ సవ్య అశోక్‌లు న్యాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి లను కోరారు. బుధవారం భైంసాకు వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే స్థానిక ఐబీలో కలిసి విన్నవించగా అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు అవుతాయన్నారు.

పరామర్శించిన మంత్రి అల్లోల

భైంసా క్రైం, డిసెంబరు 2 : భైంసా పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నారాయణ గౌడ్‌ కుటుంబ సభ్యులను అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, రాధాకిషన్‌రెడ్డి, బి.రాజన్న, స్థానిక నాయకులు, ఎంఆర్‌వో నర్సయ్య, మురళీ గౌడ్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T06:10:26+05:30 IST