బంజారాహిల్స్‌లో గెలుపొందిన అభ్యర్థిని అభినందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-06T06:46:07+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలలో బంజారాహిల్స్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయలక్ష్మీ గెలుపొందిన సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆమెను కలిసి పూలబొకే అందించి అభినందించారు.

బంజారాహిల్స్‌లో గెలుపొందిన అభ్యర్థిని   అభినందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
కార్పొరేటర్‌ను అభినందిస్తున్న మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 5 : గ్రేటర్‌ ఎన్నికలలో బంజారాహిల్స్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయలక్ష్మీ గెలుపొందిన సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆమెను కలిసి పూలబొకే అందించి అభినందించారు. శనివారం టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఎంపీ కేశవరావ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి కూతురు విజయం సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌, రాంకిషన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి అభినందించిన వారిలో ఉన్నారు.

Updated Date - 2020-12-06T06:46:07+05:30 IST