‘కల్యాణ లక్ష్మి’ నిరుపేదలకు వరం

ABN , First Publish Date - 2020-09-13T10:13:24+05:30 IST

నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీముబా రక్‌ పథకాలు వరంగా మారాయని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ..

‘కల్యాణ లక్ష్మి’ నిరుపేదలకు వరం

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఐకేరెడ్డి


చెన్నూరు, సెప్టెంబరు 12:  నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీముబా రక్‌ పథకాలు వరంగా మారాయని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని జై సంతోషిమాత ఫంక్షన్‌ హాలులో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టి ఆడపిల్లల వివాహాలకు అండగా నిలుస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో 661 లబ్ధిదారు లకు చెక్కులను అందించడం సంతోషంగా ఉందన్నారు.


మొత్తంగా రూ.6కోట్ల59 లక్షల3444లను చెక్కుల రూపకంగా  అందించామని తెలిపారు. చెక్కులతో పాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆడపడుచులకు సొంతంగా చీరలను అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. చెన్నూరులో అంబేద్కర్‌ ఏకో పార్కు ఏర్పాటు, రహ దారుల నిర్మాణాలు, పామాయిల్‌ తోటల సాగుతో నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. పాత కోర్టు భవనం ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించేందుకు, పట్టణంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం  చెన్నూరు పెద్ద చెరువులో ప్రభుత్వ విప్‌ సుమన్‌తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ మేరకు జోడువాగుల వద్ద ఏర్పాటు చేయనున్న అంబేద్కర్‌ ఏకో పార్కును మంత్రి ఐకే రెడ్డి , ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పరిశీలించారు. కార్యక్రమాల్లో  చెన్నూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనాగిల్డా, చెన్నూరు, కోటపల్లి, మందమర్రి ఎంపీపీలు మంత్రి బాపు, సురేఖ, మంగ, జెడ్పీటీసీ మోతె తిరుపతి, ఐదు మండలాల తహసీల్దార్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు. 


భీమారం: మండలంలోని పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల అంకుశాపూర్‌లో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే, విప్‌ బాల్క సుమన్‌ తన సొంత ఆయిల్‌పాం వ్యవసా య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ పంట సాగు తదితర అంశాలపై ఐకేరెడ్డికి వివరించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌ దర్శనాల రమేశ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-09-13T10:13:24+05:30 IST