వలస కూలీలు స్వీయ నిర్బంధంలో ఉండాలి

ABN , First Publish Date - 2020-05-18T10:38:41+05:30 IST

కరోనా వైరస్‌ సోకకుండా ఉంటాలంటే వలస కూలీలు స్వీయ నిర్బంధంలో ఉండాలని, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని ..

వలస కూలీలు స్వీయ నిర్బంధంలో ఉండాలి

నర్సాపూర్‌ను సందర్శించి ఎమ్మెల్యే దివాకర్‌రావు

మండలాన్ని దిగ్బంధించి ఇంటింటి సర్వే చేసిన పోలీసులు, వైద్య సిబ్బంది


దండేపల్లి, మే 17 : కరోనా వైరస్‌ సోకకుండా ఉంటాలంటే వలస కూలీలు స్వీయ నిర్బంధంలో ఉండాలని, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ అన్నారు. ఇటీవల నర్సాపూర్‌కు ముంబయి నుంచి వచ్చిన ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారందరు 28 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలన్నారు. ఎవరైనా ఇతర ప్రాం తాల నుంచి వస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు.  పాజి టివ్‌ వచ్చిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జి. శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ ఎం గురువయ్య, వైస్‌ ఎంపీపీ అనిల్‌కుమార్‌, సీఐ నారయణ నాయక్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 


స్వీయ నిర్భందంతోనే కరోనా కట్టడి : డీసీపీ

వివిధ రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారందరు స్వీయ నిర్భం దంలో ఉండాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య లు తప్పవని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో డీసీపీ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు, సిబ్బందితో కలిసి వలస కార్మికుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సుమారు 395 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి స్వగ్రామా లకు వచ్చారన్నారు.


వలస కార్మికులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 28 రోజుల పాటు హోం క్వారంటైన్‌ కచ్చితంగా ఉండాలన్నారు. ఎవరైనా బయట తిరిగితే బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంద న్నారు. ప్రజలు మాస్కులు ధరిం చకుండా బయట తిరిగితే జరిమా నాలు విధింస్తామన్నారు. మండలం లోని 31 గ్రామ పంచాయతీలో ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 150మంది పోలీసు సిబ్బందితో 15 పోలీసు బృందాలతో పాటు రెవెన్యూ, వైద్య, పంచాయతీ రాజ్‌ సిబ్బందితో కలిసి అన్ని గ్రామాల్లో వలస కార్మి కుల ఇండ్లకు వెళ్లి వివరాలు, ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమగ్ర సర్వే చేపట్టారు. తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, ఎస్సై శ్రీకాంత్‌, ఎంపీవో చంద్ర మౌళి, వైద్యాధికారులు సునిల్‌కుమార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-18T10:38:41+05:30 IST