క్రీడలతో మానసికోల్లాసం : ఓఎస్డీ

ABN , First Publish Date - 2020-12-02T05:29:44+05:30 IST

క్రీడలు మానసికోల్లాసాన్ని, శరీరక దృఢత్వాన్ని పెంచుతాయని ఆదిలాబాద్‌ వోఎస్డీ రాజేష్‌ చంద్ర అన్నారు. మండలంలోని కేస్లాపూర్‌ని నాగోబా మినీ స్టేడియంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్‌ పోటీలను మంగళవారం ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు.

క్రీడలతో మానసికోల్లాసం : ఓఎస్డీ

ఇంద్రవెల్లి, డిసెంబరు 1: క్రీడలు మానసికోల్లాసాన్ని, శరీరక దృఢత్వాన్ని పెంచుతాయని ఆదిలాబాద్‌ వోఎస్డీ రాజేష్‌ చంద్ర అన్నారు. మండలంలోని కేస్లాపూర్‌ని నాగోబా మినీ స్టేడియంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్‌ పోటీలను మంగళవారం ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం రేణుక, గ్రామ పటేల్‌ మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఓఎస్డీని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, శారీరక దారుడ్యాన్ని పెంపోందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రెండ్లీ పోలీస్‌లో భాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ నరేష్‌కుమార్‌, ఎస్సై నాగ్‌నాథ్‌, కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం రేణుకనాగనాథ్‌, గ్రామ పటేల్‌మెస్రం వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:29:44+05:30 IST