పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-11-26T04:35:45+05:30 IST
ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించి మధ్యంతర భృతిని అందజేయాలని ఎస్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బీసగౌని శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు.

- ఎస్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు,
ఏసీసీ, నవంబరు 25: ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించి మధ్యంతర భృతిని అందజేయాలని ఎస్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బీసగౌని శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని సినిమావాడలోని ఉన్నత పాఠశాలలో ఎస్‌టీయూటీఎస్ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేక పర్యవేక్షణ లోపించి విద్యార్థులకు నష్టం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. ప్రభావతి, ట్రెజరర్ ఎ. సత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ఎం. సుమన్, ఏ. నీరజ, జె. రజిత, బి. మన్మోహన్, అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.