సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2020-06-11T11:09:58+05:30 IST
పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఇన్‌చార్జీ,

అదనపు కలెక్టర్ డేవిడ్
ఆదిలాబాద్‌టౌన్, జూన్ 10: పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఇన్‌చార్జీ, అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. సంజయ్ నగర్‌లో నెలకొన్న సమస్యలను బుధవారం జడ్పీ సీఈవో కిషన్, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్‌లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీ వెనక కొన్నేళ్లుగా చెట్లు, చేమలతో నెలకొన్న పరిసరాలను పరిశీలించారు. వీటిని తొలగించి ప్రధాన మురికి కాల్వల నిర్మాణానికి, బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సైతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను విచ్చలవిడిగా పారవేయొద్దని సూచించారు. చెత్తబుట్టలోనే చెత్తను వేయాలని అప్పుడే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.