వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-11T04:18:43+05:30 IST

డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, ఫైలేరియా వివిధ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సమావేశ మందిరంలో నేషనల్‌ వెక్టర్‌ బోన్‌ డీసీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం (ఎన్‌వీబీడీసీపీ)లో భాగంగా జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యులకు ఒక్క రోజు నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 10: డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, ఫైలేరియా వివిధ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సమావేశ మందిరంలో నేషనల్‌ వెక్టర్‌ బోన్‌ డీసీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం (ఎన్‌వీబీడీసీపీ)లో భాగంగా జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యులకు ఒక్క రోజు నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి నరేందర్‌ రాథోడ్‌ మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్‌సీ వారిగా వివిధ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు, నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. దోమల రకాల వ్యాప్తి చేయు వ్యాధులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు నివారించేందుకు పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.దోమ పిల్లల నియంత్రణకు 5మి.లీ టెమిఫాస్‌ 50శాతం ఈసీ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని దోమలు పెరుగేందుకు అవకాశమున్న నీళ్లలో 500 మీటర్లు (అర కిలో మీటరు) దూరం వరకు చల్లాలన్నారు. జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి అన్నారు. ఆశలు ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు. ప్రతి సంవత్సరం రెండు నెలల మాత్రం సర్వే చేసే వారని ప్రస్తుతం ఆరు నెల పాటు సర్వే చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. స్పర్ణలేని మచ్చలు గుర్తించి అవి పుట్టుకతో ఉన్నాయా లేదా ఈ మధ్య కాలంలో వచ్చాయని గుర్తించి వైద్యులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆరోగ్య తెలంగాణకే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.సాధన, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ (కుష్టు, ఎయిడ్స్‌) డాక్టర్‌ శ్రీకాంత్‌, జిల్లా మలేరియా అధికారి మెట్‌పల్లి వార్‌ శ్రీధర్‌, ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి క్రాంతికుమార్‌, మాతశిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రాం అధికారి నవ్యసుద, మలేరియా, కుష్టు కార్యాలయ సిబ్బంది, అనిల్‌, రామణచారి, మధుసూదన్‌, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

కనీస వేతనాలు చెల్లించాలని ధర్నా..

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు సమస్యను పరిష్కరించ లేదని వెంటనే కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంతకు ముందు జిల్ల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పలుమార్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలు చేపట్టిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ డిమాం డ్లను పరిష్కరించాలని కోరుతూ విన్నవించిన నిర్లక్ష్యంగా వ్యవహ రించడం సమంజసంకాదని ఆరోపించారు. ఆశావర్కర్ల సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్‌ చేశారు. ఆశలకు కనీస వేతనాలను చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుతో ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షనమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-11T04:18:43+05:30 IST