గంజాల్‌లో సామూహిక కుంకుమార్చన

ABN , First Publish Date - 2020-12-19T06:05:02+05:30 IST

మండలంలోని గంజాల్‌ గ్రామంలో శ్రీ సత్యనారాయణస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.

గంజాల్‌లో సామూహిక కుంకుమార్చన
గంజాల్‌లో కుంకుమార్చన చేస్తున్న భక్తులు

పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలు

సోన్‌, డిసెంబరు 18 : మండలంలోని గంజాల్‌ గ్రామంలో శ్రీ సత్యనారాయణస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. వేద పండితుల మధ్య జరిగిన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో మహిళలు మంగ ళహారతులతో తరలివచ్చారు. ఉదయం గణపతిపూజ, మూలమంత్రహోమం, స్థాపిత దేవతా ఆరాధనల అనంతరం కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ప్రత్యేకపూజల అనం తరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read more