మొక్కుబడిగా సర్వసభ ్య సమావేశం

ABN , First Publish Date - 2020-12-19T05:34:17+05:30 IST

గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది.

మొక్కుబడిగా సర్వసభ ్య సమావేశం
తలమడుగులో మాట్లాడుతున్న ఎంపీపీ కళ్యాణం లక్ష్మి

తలమడుగు డిసెంబర్‌ 18; గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. శుక్రవారం ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన నిరహించిన ఈ సమావేశానికి కొంత మంది ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నా.. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం గమనార్హం. ఈ సమావేశంలో ఆయా శాఖల అధి కారులతో సమీక్షా నిర్వహించారు. కాగా, అధికారులు తమతమ నివేదికలను చదివి వినిపించారు. సమస్యల సరిష్కారం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీవో దిలీప్‌కుమార్‌, ఏవో మహేంధర్‌, వైద్యులు రాహుల్‌, దూద్‌రాం రాథోడ్‌, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

ఇచ్చోడలో సాదాసీదాగా..

ఇచ్చోడ: ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల సర్వసభ్య స మావేశం మండల కేంద్రంలో శుక్రవారం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశం ఎంపీపీ ఏన్‌ప్రీతంరెడ్డి అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యలయంలో ఉదయం 10.45నిమిషాలకు ప్రారంభించగా 1.33 గంటలకు నిమిషాలకు ముగిసింది. కాగా, ఈ సమావేశానికి వచ్చిన ఆయా శాఖల అధికారులు తన నివేదికలను చదివి వినిపించారు. మరికొంత మంది సభ్యులు సమావేశం ప్రారంభంమైన గంట ఆలస్యంగా రాగా, మరికొంత మంది మధ్యలోనే వెళ్లి పోయారు. కాగా, ఇచ్చోడ నుంచి సిరిచేల్మ బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది, మరమ్మతులు వేగవంతం చేయా లని ఎంపీటీసీలు గాడ్గే సుభాష్‌, శివకూమార్‌ అన్నారు. అదేవిధంగా మండలంలో చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని, సంబంధిత అధికారులు  ఏమాత్రం స్పందించడం లేదని వారన్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే నూతన రేషన్‌ కార్డులు అంజేస్తామని తహసీల్దార్‌ అతికోద్దిన్‌ అన్నారు. 

Read more