ప్రైవేట్‌ ఆస్పత్రుల బంద్‌

ABN , First Publish Date - 2020-12-12T04:18:23+05:30 IST

కేంద్రం విడుదల చేసిన మిక్సోపతి ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు ఎన్‌.మల్లేష్‌, ప్రధానకార్యదర్శి కాటం లక్ష్మినారాయణ, ప్రభు త్వాసుపత్రి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ ఎం.నీలకంఠేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల బంద్‌
మిక్సోపతి ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు

మంచిర్యాల కలెక్టరేట్‌. డిసెంబరు 11 : కేంద్రం విడుదల చేసిన మిక్సోపతి ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)  జిల్లా అధ్యక్షుడు ఎన్‌.మల్లేష్‌, ప్రధానకార్యదర్శి కాటం లక్ష్మినారాయణ, ప్రభు త్వాసుపత్రి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ ఎం.నీలకంఠేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. మిక్సోపతి ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా శుక్రవారం మంచిర్యాలలో ప్రైవేటు ఆసుప త్రులు మూసివేశారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి ప్రభుత్వ ఏరియాసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏఓ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మిక్సోపతి విధానాన్ని తీసుకురావ డం వైద్యరంగంలో ఇబ్బందికరమని, ఎంబీబీఎస్‌ నాలుగున్నర సంవత్సరాలు, హౌస్‌సర్జన్‌ ఒక సంవత్సరం అనుభవం కలిగిన వైద్యులు మాత్రమే సర్జరీలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ ద్వారా కేవలం ఆరునెలల శిక్షణతో ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్స చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవ న్నారు. ఆయుర్వేద వైద్యులకు అల్లోపతి వైద్యంపై ఏమాత్రం అవగాహన ఉం డదని, శస్త్ర చికిత్సల సమయంలో వాడే మందులు వికటించే ప్రమాదం పొం చివుండే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. ఐఎంఏ ట్రెజరర్‌ పూర్ణచందర్‌, మాజీ అధ్యక్షుడు రమ ణ, రవిప్రసాద్‌, వెంకటేశ్వర్లు, చంద్రదత్‌, పటేల్‌, సురేష్‌కుమార్‌, శ్రీనివాస్‌, నర్సయ్య, రాజగోపాల్‌, త్రినాథరావు, శ్రీనివాస్‌, నిశాంత్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:18:23+05:30 IST