హత్య కేసులో నిందితుని అరెస్టు..

ABN , First Publish Date - 2020-03-18T06:11:16+05:30 IST

చెన్నూర్‌ మండలం నాచెన్నూర్‌, మార్చి 17: చెన్నూర్‌ మండలం నారా యణపూర్‌ గ్రామంలో ఈ నెల 3న నిట్టూరి అంకులు

హత్య కేసులో  నిందితుని అరెస్టు..

చెన్నూర్‌, మార్చి 17:   చెన్నూర్‌ మండలం నాచెన్నూర్‌, మార్చి 17: చెన్నూర్‌ మండలం నారా యణపూర్‌ గ్రామంలో ఈ నెల 3న నిట్టూరి అంకులు ను హత్య చేసిన నిట్లూరి బాపును మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. మంగళవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సం బందించిన వివరాలను వెల్లడించారు.


మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన నిట్టూరి అంకులు ను ఈ నెల 3న అతని అన్న కుమారుడు నిట్టూరి బాపు గొంతు నులిమి ఎత్తి వేయడంతో మృతి చెందినట్లు తెలిపారు. బాపు కుటుంబ సభ్యుల మధ్య గొడ వ జరుగుచుండగా గొడవ ఎందుకు పెట్టుకుంటున్నా రు రేపు మాట్లాడుదాం అని అంకులు వారికి చెప్పే ప్రయత్నం చేశాడు. సర్పంచ్‌ ఎన్నికల సమయంలో తమకు సహకరించ లేదని, ఇప్పుడు మా కుటుంబం విషయంలో తలదూ ర్చుతున్నావా అంటూ కోపంతో నిట్టూరి బాపు అంకులు గొంతు నులిమి ఎత్తి వేశాడు.


దీంతో అంకులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు అంకులును చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అం కులు భార్య మల్లక్క ఫిర్యాదు మేరకు బాపుపై కేసు నమోదు చేశామన్నారు. అప్పటి నుంచి బాపు పరారీలో ఉండగా పక్కా సమాచారం మేరకు నారాయణపూర్‌ శివారులో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సంజీవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T06:11:16+05:30 IST