సమ్మెను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-11-13T10:29:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా ఈనెల 26న నిర్వ హించ తలపెట్టిన సమ్మె ను జయప్రదం చేయా లని తెలంగాణ మున్సిపా లిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ మంచిర్యాల

సమ్మెను జయప్రదం చేయండి

ఏసీసీ, నవంబరు 12 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా ఈనెల 26న నిర్వ హించ తలపెట్టిన సమ్మె ను జయప్రదం చేయా లని తెలంగాణ మున్సిపా లిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ మంచిర్యాల డివిజన్‌ అధ్యక్షుడు దేవి సత్యం తెలిపారు. గురువారం ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ప్రైవేటు కార్పొరేటు సంస్థలకు ఉత్పత్తులపై అజమాయిషీ కట్టబెడుతోందన్నారు. బొగ్గు పరిశ్రమలు, ఎల్‌ఐసీ, రైల్వే, రక్షణ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబ డులను ఉపసంహరిస్తోందన్నారు. కార్మికుల హక్కులు కాపాడుకోవడానికి చేస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఆవునూరి గోపాల్‌, జైపాల్‌సింగ్‌, కుంట రాయమల్లు, చెన్న మల్లేష్‌ పాల్గొన్నారు. 


లక్షేట్టిపేట: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి మేకల దాస్‌ ఐబి చౌరస్తాలో విడుదల చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను 100 శా తం ఎఫ్‌డీఐల పేరుతో ప్రైవేటు వారికి అప్పచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  మేదరి దేవవరం, రవి కిరణ్‌, రాజేశం, పోచన్న, సత్యనారాయణ, మల్లేష్‌, ఎల్లయ్య ఉన్నారు.

Updated Date - 2020-11-13T10:29:11+05:30 IST