ఎల్‌ఐసీలో వేతన సవరణ చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-11T04:33:57+05:30 IST
ఎల్‌ఐసీ సంస్థలో వేతన సవరణ చేపట్టాలని జీవిత బీమా సంస్థ మంచిర్యాల శాఖ ఉద్యోగులు, అధికారులు డిమాండ్ చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 10 : ఎల్‌ఐసీ సంస్థలో వేతన సవరణ చేపట్టాలని జీవిత బీమా సంస్థ మంచిర్యాల శాఖ ఉద్యోగులు, అధికారులు డిమాండ్ చేశారు. బీమా సంఘాల జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, అధికారులు ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. మూడు సంవత్సరాల క్రితం చేపట్టాల్సిన వేతన సవరణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా అమలు కాలేదని పేర్కొన్నారు. సంస్థ యేటా లాభాలను ఆర్జిస్తున్నా వేతన సవరణ చేపట్టకపోవడం నియంతృత్వా నికి నిదర్శనమని వారు తెలిపారు. ఎల్‌ఐసీ వాటాల విక్రయాన్ని వెనక్కి తీసుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఉమాశంకర్, రజనీకుమారి, ఆర్. రాజేశం, ఎం. రామదాసు, శ్రీనివాస్, ఫణిరామ్మోహన్, నరేష్, లింగమూర్తి, రమేష్‌బాబు, పీవీబీ రెడ్డి, సడగోపన్ రవీందర్, రాజశేఖర్ మాలతీదేవి తదితరులు పాల్గొన్నారు.