వఠోలిలో న్యాయ విజ్ఞాన సదస్సు
ABN , First Publish Date - 2020-12-27T05:57:26+05:30 IST
మండలంలోని వఠోలి గ్రామంలో శనివారం న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు.

లోకేశ్వరం, డిసెంబరు 26 : మండలంలోని వఠోలి గ్రామంలో శనివారం న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా జుడీషియల్ కోర్డు జడ్జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల న్నారు. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. యువకులకు పలుసలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముథోల్ సీఐ అజయ్‌బాబు, ఎస్సై యాసీర్ అరాఫత్, సర్పంచ్ రజిత, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మండల ఉపాధ్యాక్షులు మామిడి నారాయణ్‌రెడ్డి, నాయకులు సాయన్న, తదితరులున్నారు.