హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్ శాతాలు ఎప్పుడెప్పుడంటే...

ABN , First Publish Date - 2020-12-01T23:40:44+05:30 IST

భాగ్యనగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే...

హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్ శాతాలు ఎప్పుడెప్పుడంటే...

హైదరాబాద్: భాగ్యనగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా భయం వల్లనో, ఓటు వేసేందుకు అనాసక్తో తెలియదు గానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూసి రాజకీయ పార్టీలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అవాక్కయిన పరిస్థితి ఉంది. పాతబస్తీలో పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


పాతబస్తీ అంతటా పోలింగ్ 25 శాతానికి మించలేదు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. సాయంత్రం 4.30 గంటల వరకు 30.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత మందకొడిగా పోలింగ్ సాగడం జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే.. గతంలోనూ అతి తక్కువ పోలింగ్ శాతాలు నమోదయిన సందర్భాలున్నాయి. హైదరాబాద్‌లో అతితక్కువ పోలింగ్ శాతాలు నమోదయిన సందర్భాలివే...


2009 జీహెచ్ఎంసీ ఎన్నికలో 42.04 శాతం, 2016లో 45.29 శాతం పోలింగ్

2009 సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ నమోదు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం పోలింగ్

2019 లోక్‌సభ ఎన్నికల్లో 39.46 శాతం పోలింగ్ నమోదు

Updated Date - 2020-12-01T23:40:44+05:30 IST