కుష్టు వ్యాధి చికిత్స నూతన వార్డు ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-28T04:47:12+05:30 IST
జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న కుష్టు వ్యాధి గ్రస్థుల వార్డు (టీహెచ్‌డబ్ల్యూ)ను ఓపీ ప్రాంగణం లోని పీపీ యూనిట్ పక్కకు తరలించారు. దీంతో శుక్రవారం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం, ఆర్‌ఎంవో శోభాపవార్, ఆదిలాబాద్ నిర్మల్ డీఎంఅండ్ హెచ్‌వోలు డా.నరేందర్ రాథోడ్, డా.ధన్‌రాజ్‌లు ప్రారంభించారు.

ఆదిలాబాద్‌టౌన్, నవంబరు 27: జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న కుష్టు వ్యాధి గ్రస్థుల వార్డు (టీహెచ్‌డబ్ల్యూ)ను ఓపీ ప్రాంగణం లోని పీపీ యూనిట్ పక్కకు తరలించారు. దీంతో శుక్రవారం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం, ఆర్‌ఎంవో శోభాపవార్, ఆదిలాబాద్ నిర్మల్ డీఎంఅండ్ హెచ్‌వోలు డా.నరేందర్ రాథోడ్, డా.ధన్‌రాజ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌వోలు మాట్లాడుతూ ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరినందున పీపీ యూనిట్ సమీపంలోకి లెప్రసీ వార్డును తరలించామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రూం నెంబర్ 18 సిని కేటా యించామని తెలిపారు. ఈ మార్పును కుష్టు వ్యాధిగ్రస్థులు, ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డా.శ్రీకాంత్, డీపీఎంవోలు వామన్‌రావ్, మధు సూదన్, వైద్యుడు విక్రమ్, సిబ్బంది రమణాచారి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.