కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T04:00:56+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నా రు.
కలెక్టర్ భారతి హోళికేరి
చెన్నూరు, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నా రు. మంగళవారం కిష్టంపేట, బావురావుపేట గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె పరి శీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి పేర్లు నమోదు చేసు కోవాలన్నారు. ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాల ని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం కిష్టం పేటలో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి సంతృప్తి వ్య క్తంచేశారు. డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో శేషాద్రి, తహసీల్దార్ జ్యోతి, సర్పంచురాకేష్‌గౌడ్ ఉన్నారు.
భీమారం: మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ భారతి హోళికేరి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని రికార్డులో ఎందుకు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో మాయిశ్చరింగ్ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించిన కలెక్టర్ వెంటనే మరో మిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు రశీదులను అందజేయాలన్నారు. డీఎస్‌వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయానందం, ఆర్‌ఐ అరుణ, ఐకేపీ ఏపీ ఎం త్రయంబకేశ్వర్, సీసీ శంకర్, కేంద్రం నిర్వాహ కులు అరుణ ఉన్నారు.