కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-27T04:11:10+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
హాజీపూర్‌ మండలంలోని దొనబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య

హాజీపూర్‌, నవంబరు 26 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య పేర్కొన్నారు. గురువారం దొనబండలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోనా ధాన్యం మ్యాచర్‌ చూసి ఎంత తూకం వస్తుందని చూశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రైతు శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను చేస్తోందన్నారు.  కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో భూమి బీడు పోకుండా సాగు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేయడం జరుగుతుందన్నారు. రైస్‌మిల్లర్లతో ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 220 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 50 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. కొనుగోలు వివరాలను డాటా ఎంట్రీ చేస్తే 48 గంటల్లోపు రైతు ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, పండించిన ప్రతీ గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.   జిల్లా సహకార అధికారి సంజీవరెడ్ది, జిల్లా వ్యవసాయాధికారి  వీరయ్య, మండల వ్యవసాయాధికారి రజిత, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్‌ విండో చైర్మన్‌ సాగి ప్రభాకర్‌రావు, వైస్‌ ఎంపీపీ బేతు రమాదేవి, వైస్‌ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌, జడ్పీ కోఆప్షన్‌ నాయిమ్‌ పాషా, సర్పంచ్‌ జాడి సత్యం, ఎంపీటీసీలు జాడి వెంకటేష్‌, ఉప సర్పంచ్‌ అనుణ్య, పంచాయతీ కార్యదర్శి మాదవ్‌ జాదవ్‌, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి

దండేపల్లి, నవంబరు 26 :  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య అన్నారు. వెల్గనూర్‌లో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు  కేంద్రాలల్లో ధాన్యం విక్రయించాలన్నారు. ఏగ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ.1,888, బీగ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ.1,868 మద్దతు ధర పొందాలన్నారు. సర్పంచ్‌ బిల్లకూరి శంకరయ్య, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ అక్కల రవీందర్‌, ఎంపీటీసీ చుంచు మల్లవ్వ-లక్ష్మీనారయణ, ఉప సర్పంచ్‌ కండ్రాపు లక్ష్మణ్‌, నిర్వాహకులు శ్రీనివాస్‌,  రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:11:10+05:30 IST