తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే

ABN , First Publish Date - 2020-05-18T10:37:01+05:30 IST

తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు.

తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 


కాగజ్‌నగర్‌, మే17: తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. పీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే అన్నారు.   ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెట్ల నరికివేతలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేయడం దారుణమని   అన్నారు.


ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనున్న భారీ వృక్షాలు ఎండిపోవడంతో వాటిని తొలగించేందుకు టెండరు కూడా పిలిచినట్టు కోనప్ప పేర్కొన్నారు. టెండరు దారుడు కట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోగా అకారణంగా తనపై బురద జల్లే కార్యక్రమం చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి స్థానిక నాయకులు తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడటం సరికాదని కోనప్ప హితవు పలికారు. 40చెట్లు నరికి వేసినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T10:37:01+05:30 IST