కొమురంభీం జిల్లాలో పెద్ద పులి సంచారం

ABN , First Publish Date - 2020-12-11T13:57:24+05:30 IST

జిల్లాలోని బెజ్జూరు మండలం తలాయి సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

కొమురంభీం జిల్లాలో పెద్ద పులి సంచారం

కొమురంభీం:  జిల్లాలోని బెజ్జూరు మండలం తలాయి సమీపంలో  పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రాణహిత నదిలో నీరు తాగుతున్న పులిని చూసిన మత్స్యకారులు బిగ్గరగా కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు...అక్కడ ఉన్నది పులి అడుగులను నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అధికారులు సూచన జారీ చేశారు.

Updated Date - 2020-12-11T13:57:24+05:30 IST