పులి కోసం కొనసాగుతున్న అటవీశాఖ వేట
ABN , First Publish Date - 2020-11-13T15:31:48+05:30 IST
విఘ్నేష్ ను హతమార్చిన పులి కోసం అటవీ శాఖ అధికారులు వేట కొనసాగుతోంది.
కొమురం భీం: విఘ్నేష్ ను హతమార్చిన పులి కోసం అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతోంది. దిగిడ గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో బోన్లు, కెమెరాలను ఏర్పాటు చేశారు. దాడి అనంతరం పులి సంచరించిన ప్రాంతాలపై దృష్టి సారించారు. పెద్ద వాగు పరిసర అడవుల్లో పులి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో వేట కొనసాగుతోంది.
కాగా అటవీ అధికారులపై దిగిడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులిని నుంచి ముప్పు ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అప్పుడే చర్యలు తీసుకుంటే మనిషి ప్రాణం దక్కేదని వాపోయారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. పంట చేలకు కూడా వెళ్లలేక పోతున్నామని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.