కొమురంభీం ప్రాజెక్టు నుంచి 1550 క్యూసెక్కుల నీరు విడుదల
ABN , First Publish Date - 2020-10-14T15:51:36+05:30 IST
భారీ వర్షాలతో కొమురంభీం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 1 గేటు ఎత్తివేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్: భారీ వర్షాలతో కొమురంభీం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 1 గేటు ఎత్తివేశారు. దాదాపు 1550క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా..ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లకు చేరింది.