కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2020-12-14T04:08:12+05:30 IST

కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ కేతేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన జాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తారు.

కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి

కౌటాల, డిసెంబరు13: కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ కేతేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన జాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6గంటల నుంచే భక్తులు తరలివచ్చారు. మొదట అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్‌ బృంధావనం శ్రీకృష్ణ మఠానికి చెందిన శివరాం స్వామి కమిటీ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించు కున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా హింధు ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి గొల్లపల్లి సత్యనారాయణ, కంకాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.   జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, టీటీడీ ధర్మాచార్యులు, నోముల చంద్రశేఖర్‌, పెద్దపల్లి సత్యప్రకాష్‌, రామకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, సుదర్శణ్‌గౌడ్‌, శ్రీధర్‌, ఎంపీపీ విశ్వనాథ్‌, ఆలయ పండితులు అంబేద శంకరయ్య, ఆలయ అధ్య క్షుడు సత్తయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలు కళ్యాణమ్మ, నాగేశ్వర్‌రావు, నక్క శంకర్‌, ఎంపీటీసీ మనీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:08:12+05:30 IST