తెలంగాణ యాసకు వన్నె తెచ్చిన కాళోజి
ABN , First Publish Date - 2020-09-10T09:27:17+05:30 IST
తెలంగాణ యాస, భాషలకు తన రచనలు, కవితల ద్వారా వన్నె తెచ్చిన వ్యక్తి కాళోజి నారాయణరావు అని బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ రావ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ
ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబరు 9: తెలంగాణ యాస, భాషలకు తన రచనలు, కవితల ద్వారా వన్నె తెచ్చిన వ్యక్తి కాళోజి నారాయణరావు అని బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ రావ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి రచనలు, కవితల ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. ముందుగా కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందు లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి, అసోసియే ట్ అధ్యక్షుడు జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌ఖత్రి, పోతారం నర్సాగౌడ్, సామల ప్రశాంత్, శ్రీపాద శ్రీనివాస్, బండారి దేవన్న తదితరులున్నారు. అటు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ప్రజాకవి కాళోజి జయంతి నిర్వహించారు. కాళోజి రచనలు, కవితలను స్మరించుకుంటేనే తెలుగుజాతి ప్రజలను ఆయన చైతన్యవంతులు చేసిన విధానాన్ని గుర్తు చేశారు. ఇందులో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, తదితరులున్నారు.
నేరడిగొండ: పుట్టుక నీది.. చావు నీది, బ్రతుకంతా దేశానిది.. అంటు ఎలుగెత్తి చాటిన తెలంగాణ సాహితివేత్త కాళోజి నారాయణరావు జయంతిని మండలంలోని వాంకిడి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ రాజు కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు జీవీతాంతం తెలంగాణ భాష, యాసకు అరుదైన గౌరవం తెచ్చారన్నారు. కాళోజి మనయాస, భాషను కాపాడుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. ఇందులో పాలకవర్గ సభ్యులు, పశువైద్యాధికారి సుశీల్‌కుమార్, తదితరులు ఉన్నారు.
బోథ్ రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు బుధవారం మండలవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సోనాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం కాళోజీ సాహిత్య సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రడాపు మధుసూదన్, ఉపాధ్యాయులు పి.లక్ష్మినర్సయ్య, గీతావాణి, శ్రావణి, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్: కాలోజీ నారాయణ రావు జయంతిపురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ భాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ కేశవులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నారాయణరావు పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, అధ్యాపకులు మంజుల, సువర్ణ, వినోద్, సుజాత, శ్రీనివా్‌సరావు, గణేష్, దినే్‌షరెడ్డి, తిరుపతి, సాంబరాజులు, తదితరులు పాల్గొన్నారు.
అలాగే, ఇంద్రవెల్లిలోని స్థానిక గ్రంఽథాలయం ఆవరణలో కాళోజి జయంతిని నిర్వహించారు. గ్రంఽథాలయ అధికారి కాంబ్లే వెంకటి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని, జీవితాంతం పేదవాళ్ల పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోడికే దళితానంద్, దరంసింగ్, సంతో్‌ష పాల్గొన్నారు.