‘కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అందరికీ న్యాయం’
ABN , First Publish Date - 2020-12-27T05:58:51+05:30 IST
కాంగ్రెస్ పార్టీ హయాం లోనే అన్నివర్గాల వారికి న్యాయం చేకూరిందని డీసీసీ అధ్యక్షులు రమారావు పటేల్ అన్నారు.

కుంటాల, డిసెంబరు 26 : కాంగ్రెస్ పార్టీ హయాం లోనే అన్నివర్గాల వారికి న్యాయం చేకూరిందని డీసీసీ అధ్యక్షులు రమారావు పటేల్ అన్నారు. శనివారం కుంటాల మండలం అంబుగాం గ్రామంలో ఎంపీటీసీ సవిత మోహన్ కుటుంబాన్ని ఆయన పరామర్శిం చారు. ఇటీవల ఎంపీటీసీ మోహన్ తండ్రి అనా రోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈయన వెంట ఎంపీపీ ఆప్క గజ్జారాం, మండల కన్వీనర్ వెంగళ్‌రావు, మాజీ సర్పంచ్ గజ్జారాంతో పాటు పలువురున్నారు.