పల్లెల్లో ఉద్యోగం.. పట్నంలో నివాసం

ABN , First Publish Date - 2020-03-24T10:26:45+05:30 IST

వారు ప్రభుత్వానికి ప్రజల కు వారధులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల కు చేరవేయడంలో వారిదే కీలకపాత్ర. కానీ వారే నిబం ధనలకు...

పల్లెల్లో ఉద్యోగం.. పట్నంలో నివాసం

  •  ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు 
  •  పని చేసేచోట నివాసముండని ఉద్యోగులు  
  •  ఇబ్బందులు పడుతున్న ప్రజలు


నేరడిగొండ, మార్చి23: వారు ప్రభుత్వానికి ప్రజల కు వారధులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల కు చేరవేయడంలో వారిదే కీలకపాత్ర. కానీ వారే నిబం ధనలకు పాతరేస్తున్నారు. ఉద్యోగం ఒకచోట చేస్తారు.. ని వాసం మరోచోట. ఇంకేముందే సమయానికి రారు.. పని చేయరు. ఇదీ మన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు. ప్రభు త్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి ప్రవేశపెట్టిన పథ కాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల దే కీలకపాత్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవ హరించేది వారే. అందుకే ప్రభుత్వం పని చేసేచోట నివా సముండాలని నిబంధన విధించింది. బోథ్‌ నియోజక వ ర్గంలోని మండలాల్లో 70శాతం మంది ప్రభుత్వ ఉద్యోగు లు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసి స్తున్నారు. దీంతో అవసరమైన సమయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని నిమిత్తం దూరప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చే ప్రజలు అధికారి ఎ ప్పుడు  వస్తాడా అని ఎదురుచూడాల్సి వస్తోంది.


ఆలస్యంగా రావడం... తొందరగా వెళ్లడం

ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న అధికారులు వా రు పనిచేసే ప్రాంతాలు దూరంగా ఉండడంతో కార్యాల యాలకు సమయానికి రాలేకపోతున్నారు. కొంతమంది ఉద్యోగులు రవాణా సౌకర్యం సక్రమంగా లేదన్న సాకుతో వెళ్లాల్సిన సమయానికంటే ముందుగానే వెళ్తున్నారు. దీంతో పనినిమిత్తం ప్రజలు రోజుల తరబడి కార్యాలయా ల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది.


అందరిదీ అదే దారి..

బోథ్‌ నియోజకవర్గంలో బోథ్‌, ఇచ్చోడ, నేరడిగొండ, సి రికొండ, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌, తలమడుగు, తాంసి, భీంపూర్‌ మండలాల్లోని రెవెన్యూ, మండల ప్రజా పరిషత్‌, వైద్య, విద్యా, వ్యవసాయం ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సూమారు 2వేల మంది వ రకు పనిచేస్తున్నారు. ప్రధానంగా తహసీల్దార్‌, ఎంపీడీవో, మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వైద్యాధి కారి, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇ తర ప్రాంతాల్లో ఉంటున్నారు. సమయానికి కార్యాలయా లకు ఉద్యోగులు, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.


ఇంటి అద్దెలు స్వాహా..

ప్రభుత్వ ఉద్యోగులకు వారి హోదాలకు అనుగుణంగా ప్రభుత్వం వేలాది రూపాయలు ఇంటి అద్దె రూపంలో చెల్లిస్తుంది. కోందరు ఉద్యోగులు స్థానికంగా ఉంటున్నట్లు రుజువులు చూపిస్తున్నా  వాస్తవానికి చాలా మంది అదికారులు పట్టణాల్లో నివాసముంటున్నారు. దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతోంది. ఇలా అధికారులు స్థానికంగా ఉండక పోవడంతో పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొ రవచూపి బోథ్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే చోటే నివాసం ఉండేలా, నిర్ణీత సమయాల్లో వి ధులకు సక్రమంగా హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read more