ఘనంగా ప్రధాని మోదీ జన్మదినం
ABN , First Publish Date - 2020-09-18T06:03:00+05:30 IST
భారత ప్రధాని నరేంద్రమోదీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య అన్నారు

దండేపల్లి,సెప్టెంబరు 17: భారత ప్రధాని నరేంద్రమోదీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య అన్నారు. మోదీ 70వ జన్మదినం వేడుకలను గురువారం నిర్వహించారు. 70మంది వృద్ధులకు పండ్లు, దుస్తులు అందచేశారు. కార్యక్రమంలో శంకర్‌గౌడ్, భూమేష్, మల్లేష్, హరికృష్ణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.
తాండూర్(బెల్లంపల్లి): బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవా జ్యోతి శరణాలయంలో ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శరణాలయం లోని పిల్లలకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. పుల్గం తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.
ఏసీసీ: మోదీ జన్మదినం పురస్కరించుకొని పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల బాలకృష్ణ ఆధ్వర్యంలో 70 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు. గోనె శ్యాంసుందర్‌రావు, గోపతి మల్లేశ్, వెంక టేశ్వర్‌రావు, పొట్టి వెంకటేశ్వర్రావు, మధు, పాల్గొన్నారు.
నస్పూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సంద ర్భంగా బీజేపీ నాయకులు షిర్కే సెంటర్ వద్ద మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సీసీసీ కార్నర్లో పండ్లను పం పిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, కౌన్సిలర్ అగల్‌డ్యూటీ రాజు, కౌన్సిలర్లు సత్యనారాయణ, కోడూరి లహరి విజయ్, జోగుల శ్రీదేవి, దొంగరి శ్వేతా, పాల్గొన్నారు.
భీమారం: మండలంలోని వర్డ్షవర్ ఆశ్రమంలోని పిల్లలకు బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, ఉపాధ్యాక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి జాడి ప్రభాకర్‌లు పండ్లు పంపిణీ చేశారు. కృష్ణ చైతన్య, శ్రీనివాస్, మహేష్, పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో షేడ్ అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అనంతరం అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ హాజరయ్యారు. అరిగెల రవీందర్, రాజలింగు, అక్కల రమేష్, దండు రాజేందర్, బైరా మల్లేష్, అందుగుల రవీందర్, పాల్గొన్నారు.
నెన్నెల: ప్రధాని నరేంద్రమోది జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. టి. శైలెందర్‌సింగ్, గట్టు రాజయ్య, గోగు సురేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.