అడిగావ్‌(కె) ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో అక్రమాలు

ABN , First Publish Date - 2020-12-16T04:58:20+05:30 IST

కోట్లాది రూపాయలతో నిర్మించిన అడిగావ్‌(కె) ప్రాజెక్టు ద్వారా రైతుల పంటలకు నీళ్లు అందించడానికి చేపట్టిన కాల్వ(కెనాల్‌) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. మంగళవారం నీటి పారుదల, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు విచారణకు వెళ్లగా రైతులు అధికారులను నిలదీశారు.

అడిగావ్‌(కె) ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో అక్రమాలు
నిలిచిపోయిన కెనాల్‌ వద్ద విచారణ చేపడుతున్న అధికారులు

ఇచ్చోడరూరల్‌, డిసెంబరు 15: కోట్లాది రూపాయలతో నిర్మించిన అడిగావ్‌(కె) ప్రాజెక్టు ద్వారా రైతుల పంటలకు నీళ్లు అందించడానికి చేపట్టిన కాల్వ(కెనాల్‌) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. మంగళవారం నీటి పారుదల, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు విచారణకు వెళ్లగా రైతులు అధికారులను నిలదీశారు. 15 ఏళ్ల క్రితం ఇచ్చోడ మండలంలోని అడిగావ్‌(కె) గ్రామ శివారులో చెరువును నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి 2008 ఏడాదిలో సర్వే చేశారు. ఎడమ కాల్వ పనులు ఇప్పటి వరకు నిర్మాణానికి చేపట్టక పోగా కుడి కాలువ కింద పదేళ్ల క్రితం భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించారు. కుడి కాల్వ నిర్మాణం నక్ష ప్రణాళిక ప్రకారంగా కాలువ తవ్వకుండా, ఇష్టానుసారంగా తవ్వినట్లు అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. కళ్లెం లత వ్యవసాయ భూములు కుడి కాల్వ కింద సర్వేలో పేరు లేకుండా మూడేళ్ల క్రితం కాలువ తవ్వుతుండగా నిలిపి వేసింది. కాల్వలు లేకుండా ఇద్దరు రైతులకు నష్ట పరిహారం అందించారని రైతులు తెలిపారు. దీనిపై అధికారులు సమాధానం ఇవ్వలేక పోయారు. అడిగావ్‌(కె)లో మరో రైతు శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు కళ్లెం వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సర్వే ప్రకారంగా కాల్వ తవ్వకుండా సోయం పొలం న ఉంచి అదనంగా అరు గుంటలు భూమిలో కాలువ తవ్వి పక్క నుంచి కెనాల్‌ తీసుకెళ్లారని దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించ లేదని ఆయన అధికారులను నిలదీశారు. విచారణకు వచ్చిన నీటి పారుదల శాఖ ఏఈ జాదవ్‌ప్రకాష్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, సర్వేయర్‌ బాపురావులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్‌రెడ్డిలు రైతులతో మాట్లాడుతూ కాల్వ నిర్మాణంలో మీరు చేసిన వివరాలు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అక్కడనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఏనుగు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాల్వల నిర్మాణంలో నక్ష ప్రకారంగా జరగనుందున కాంట్రాక్టర్‌, అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-16T04:58:20+05:30 IST