ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-11-26T05:17:34+05:30 IST

తమ కున్న వనరులకు అనుగుణంగా ఆదా యాన్ని పెంచే దిశగా కార్మికులు కృషి చేయాలని ఆర్టీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌ అన్నారు. బుధవారం బస్‌డిపోతో పాటు బస్టాండ్‌ను సందర్శించి పలు విషయాలను తెలుసు కున్నారు.

ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ మునిశేఖర్‌

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 25: తమ కున్న వనరులకు అనుగుణంగా ఆదా యాన్ని పెంచే దిశగా కార్మికులు కృషి చేయాలని ఆర్టీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌ అన్నారు. బుధవారం బస్‌డిపోతో పాటు బస్టాండ్‌ను సందర్శించి పలు విషయాలను తెలుసు కున్నారు. ముందుగా డిపోను పరిశీలించి అక్కడ బస్సుల మెయింటనెన్షన్‌, బస్సుల కండిషన్‌ లాంటి వివరాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం బస్టాండ్‌ను సందర్శించి ఎంక్వైరీ కౌంటర్‌, రిజర్వేషన్‌ కౌంటర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈడీగా బాధ్యతలు స్వీకరించి తొలి సారి ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయనకు శాలువతో సత్కరించి పుష్ప గుచ్భం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు మూడు నెలల పాటు బస్సులు రోడ్డెక్కలేదన్నారు. సడలింపు తర్వాత రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పటికి ఆదాయం మాత్రం రావడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహకా రంతో సంస్థ ముందుకు సాగుతుందన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటునే ఆలస్యమై కార్మికుల వేతనాల్లో మాత్రం జాప్యం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం విజయ్‌భాస్కర్‌, డీవీఎం రమేష్‌, పీఓ విలాస్‌రెడ్డి, ఏవో  బాలస్వామి, డిపో మేనేజర్లు జనార్దన్‌, అంజనేయులు, మల్లేష్‌, రవీందర్‌, మారుతి తదితరులున్నారు. 

Read more