ప్రథమ స్థానంలో ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంస్థ

ABN , First Publish Date - 2020-12-16T05:04:54+05:30 IST

రైతులు సంఘటితమై పొదుపు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వైకే రావు అన్నారు. మంగళవారం ఎమాయికుంటలోని నాబార్ట్‌ ఆర్థిక సహాయంలో రైతు ఉత్పాదక సంస్థ నిర్మించిన నూతన జిన్నింగ్‌ బిల్లును ఆయన ప్రారంభించారు.

ప్రథమ స్థానంలో ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంస్థ
జిన్నింగ్‌ మిల్లును ప్రారంభిస్తున్న వైకే రావు

ఇంద్రవెల్లి, డిసెంబరు 15: రైతులు సంఘటితమై పొదుపు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వైకే రావు అన్నారు. మంగళవారం ఎమాయికుంటలోని నాబార్ట్‌ ఆర్థిక సహాయంలో రైతు ఉత్పాదక సంస్థ నిర్మించిన నూతన జిన్నింగ్‌ బిల్లును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఐఎఫ్‌సీఎల్‌ సంఘాలకు తోడ్పాటునిస్తుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 330 రైతు గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి మరిన్ని రుణాలను తీసుకోవాలన్నారు. రైతుల కోసం టెక్స్‌టైల్‌ పార్కుకు సైతం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. రైతులు పత్తితో పాటు కూరగాయాలు, పండ్లు, నూనే గింజల వంటి మార్కెట్‌ లో డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారించాలన్నారు. ఐఎఫ్‌సీఎల్‌కు నాబార్డు ద్వారా రూ.60 లక్షలు, నాబార్ట్‌ కిసాన్‌ ద్వారా 12 లక్షల చేయూత నివ్వడం జరిగిందన్నారు. నాబార్ట్‌ జీఎం జ్యోతిస్వరూప్‌ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చెరుకు ప్యాక్టరీ చూశామన్నారు. ఎలాంటి నీటి సదుపాయం లేనిగిరిజన ప్రాంతంలో పత్తి పంటను పండిస్తూ జిన్నింగ్‌ ఏర్పాటు చేయడం సంతోష కరమన్నారు. టీజిఆర్‌ఎం రఘునందన్‌ మాట్లాడుతూ ఇక రైతు సంఘాలకు బ్యాంకులు వారి ద్దకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. సీఈవో రాథోడ్‌ నిలేష్‌ మాట్లాడుతూ జిన్నింగ్‌ మండలంలో ఇంతవరకు 837 రైతు సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘాల ద్వారా ఇంతవరకు బ్యాంకులు చేసిన సహాయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ డీడీఎం రాజశేఖరరెడ్డి, ఏడీసీసీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎఫ్సీఐఎల్‌ చైర్మన్‌ తానుబాయ్‌, భీంరావు, గోడాం రామారావు, సిబ్బంది సంతోష్‌, ఆఫీస్‌ బేగ్‌, గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:04:54+05:30 IST