జోరుగా జూదం

ABN , First Publish Date - 2020-04-26T09:49:48+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభిస్తోంది. ప్రజలంతా భయం భయంగా కాలం గడుపుతు న్నారు.

జోరుగా జూదం

కాలక్షేపం పేరిట జోరుగా పేకాట.. జేబులు ఖాళీ

పల్లె, పట్టణ శివారుల్లో రహస్యంగా ఆడుతున్న వైనం

కరోనా కట్టడి విధుల్లో పోలీసులు

సామాజిక దూరం, మాస్కులు ధరించడంపై నిర్లక్ష్యం!


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభిస్తోంది. ప్రజలంతా భయం భయంగా కాలం గడుపుతు న్నారు. కానీ కొందరు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నా రు. లాక్‌ డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నా.. బే ఖాతరు చేస్తున్నారు. దీనికి పేకాట జూదరులు మినహాయింపు ఏం కాదు. లాక్‌ డౌన్‌వేళ ఖాళీ స మయం దొరకడంతో జూదం ఆడేస్తున్నారు. లాక్‌ డౌన్‌తో జన సంచారం, పోలీసుల నిఘా తగ్గి పో వడంతో మరింత రెచ్చిపోతున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా జూదరులు ఏ మాత్రం పట్టింపు లేకుండా పేకాట ఆడేస్తున్నారు.


జిల్లాలో మట్కా, జూదంతోపాటు పేకాట కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బృంధావన్‌ కాలనీ శివారు ప్రాంతంలో పేకాట ఆ డుతున్న 10 మంది ని పోలీసులు అరె స్టు చేశారు. రూ.17వేల 900ల నగదును స్వాధీ నం చేసుకు న్నారు. లాక్‌ డౌన్‌తో కొంత మేరకు క్రైం రేటు తగ్గింది అనుకుంటే.. పే కాట, జూదం మాత్రం తగ్గడం లేదు.  లాక్‌ డౌన్‌తో అన్ని రకాల వ్యాపార లావాదేవీల పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో అనుకున్నంత సమయం దొరుకుతోంది. గతంలో రూ.36 ఉన్న పేకాట కార్డ్స్‌ ప్రస్థుతం రూ.150 నుంచి రూ.200ల వరకు ధర పలుకుతోంది. అంటే ఏ స్థాయిలో పేకాట నడు స్తుందో తెలుస్తోంది. కొందరు జూదరులు అదే ప నిగా పేకాట ఆడుతున్నారు. జిల్లాలో పల్లె, పట్ట ణం అనే తేడా లేకుండా విచ్ఛలవిడిగా పేకాట ఆ డుతున్నారు.


కాలక్షేపం పేరిట..లాక్‌ డౌన్‌ నిబంధనలపై నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో ఇంటికే పరిమితమైన జూదరు లు కాలక్షేపం పేరిట పేకాట జూదానికి తెరలేపు తున్నారు. ఇలా మొదలైన జూదం నిత్యం లక్షల రూపాయల్లో దందా సాగుతోంది. కష్ట కాలంలో జూదం పేరిట కొందరు జేబుల ఖాళీ చేసుకుంటు న్నారు. దీని      కారణంగా కుటుంబంలో కలహాలు పెరుగు తున్నాయి. మహిళలపై వేధింపులు పెరిగి పోతున్నాయి.  లాక్‌డౌన్‌తో పనిలేక అల్లాడుతున్న పరిస్థితుల్లో పేకాట రాయుళ్లు ఆర్థికి పరిస్థితిని పట్టించుకో కుండా నష్టపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదేపనిగా జూదరులు పేకాటతో కాలం గ డుపుతున్నారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా జిల్లాలో పేకాట, మట్కా జూదంలు గుట్టు చప్పుడుగా కాకుండా కొనసాగుతున్నాయి. 


నిత్యం కరోనా విధుల్లో..

నిత్యం కరోనా వైరస్‌ కట్టడి విధుల్లో పోలీసులు బిజీ బిజీగా ఉండడంతో శివారు ప్రాంతాలపై ని ఘా తగ్గుతోంది. దీంతో జూదరుల ఆగడాలకు అ డ్డు అదుపూ లేకుండా పోతోంది. లాక్‌డౌన్‌తో జ నం కూడా బయటకు వెళ్లక పోవడంతో శివారు ప్రాంతాలు మరింత నిర్మానుషంగా మారాయి. ఇ దే అదునుగా పేకాట, మట్కా, జూదం మరింత పెరిగిపోతోంది. ఇప్పటికే జూదానికి అలవాటు ప డ్డ వారంతా లాక్‌డౌన్‌లోనూ అదే తీరుతో వ్యవహ రిస్తున్నారు. గతంలో జూదానికి అడ్డుకట్ట వేసిన పోలీసులు లాక్‌డౌన్‌తో అంతగా అటువైపు దృష్టి సారించడం లేదు. కరోనా వైరస్‌ ప్రభలకుండా.. పకడ్బందీ లాక్‌ డౌన్‌ అమలు అయ్యేలా నిత్యం వాహనాల తనిఖీలతో పోలీసులు బిజీబిజీగా గడు పుతున్నారు. దీంతో జూదరులపై నిఘా పెట్టడం పోలీసులకు సవాలుగా మారుతోంది. కరోనాపై ఎంత అవగాహన కల్పిస్తున్న కొందరు వినిపించు కోక పోవడంతో పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మరింత కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితు లు అదుపులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 


లాక్‌డౌన్‌ నిబంధనలు బేఖాతరు..

జిల్లాలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై య్యాయి. తమకేమీ కాదనే ధీమా జూదరుల్లో కని పిస్తుంది. సామాజిక దూరం, మాస్కులు ధరించ కుండానే పేకాట ఆడడం ఆందోళనకర పరిస్థితుల కు దారితీస్తుంది. యథేచ్ఛగా లాక్‌ డౌన్‌ నిబంధన లను అతిక్రమిస్తున్నారు. దీంతో ప్రమాదకర పరి స్థితులు ఏర్పడుతున్నాయి. ఒకే చోట గుంపులు గుంపులుగా గుమిగూడి పేకాట ఆడుతున్నారు. క రోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఒకరికొకరు కనీసం మీటర్‌ దూరంలోనైనా ఉండాలి. కానీ జూ దరులు అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 


నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్‌ సమ యంలోనూ పేకాట, జూదం ఆడుతూ పట్టు బడితే కేసులు నమోదు చేస్తాం. పోలీసులు కరోనా కట్టడి విధుల్లో ఉన్నా.. ప్రజల సహాకా రంతో జూదరులను పట్టుకుంటాం. అలాగే పోలీసు నిఘా విభాగం పకడ్బందీగా వ్యవ హరిస్తోంది. అందరూ తప్పనిసరిగా సామా జిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరిం చాలి.

- వెంకటేశ్వరరావ్‌, డీఎస్పీ, ఆదిలాబాద్‌

Updated Date - 2020-04-26T09:49:48+05:30 IST