బాల,బాలికల చట్టాలపై అవగాహన పెంపొందించాలి
ABN , First Publish Date - 2020-12-19T06:02:36+05:30 IST
18 సంవత్సరాలలోపు గల బాలబాలికలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టడానికి తీసుకువచ్చిన చట్టాలపై అవ గాహన పెంపొందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు అన్నారు.

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు
నిర్మల్‌టౌన్, డిసెంబరు 18 : 18 సంవత్సరాలలోపు గల బాలబాలికలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టడానికి తీసుకువచ్చిన చట్టాలపై అవ గాహన పెంపొందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల వసతిగృహంలో అధికారులకు ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవోసీఎస్‌వో చట్టం బాలబాలికల రక్షణకోసం తీసుకువచ్చిందన్నారు. ఇలాంటి దురాచారాలను అరికట్టడానికి ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ర్తీ, శిశు సంక్షేమ అధికారులు మురళీ, శైలజ, సలహాదారులు న్యాయవాది నరేందర్, క్రాంతి, కిరణ్, తది తరులు ఉన్నారు.