‘ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి’
ABN , First Publish Date - 2020-12-11T05:58:35+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యతో పాటు కొవిడ్ పరీక్షలు పెంచడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని డా. కామేశ్వర్ అన్నారు..
ముథోల్, డిసెంబరు 10 : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యతో పాటు కొవిడ్ పరీక్షలు పెంచడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని డా. కామేశ్వర్ అన్నారు. జిల్లా ఉన్నతధికారుల ఆదేశాల మేరకు గురువారం ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముథోల్, బాసర వైద్యసిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధరణ ప్రసవాలు జరిగే విధంగా చూడాల న్నారు. గ్రామాలల్లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు ఉంటాయని వివరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, పద్మ, భాగ్య, దత్తురాం, జ్యోతి, కిశోర్‌కుమార్, విజయ, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.