ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరగాలి
ABN , First Publish Date - 2020-12-06T06:48:09+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరగాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్ టౌన్, డిసెంబరు 5 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరగాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆర్‌కే కన్వెక్షన్ హల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా మండలాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సాధారణ ప్రసవాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ, ప్రాథమిక, ప్రైవేట్ ఆసుపత్రులలో 25 శాతం సాధారణ ప్రసవాలు ఖచ్చితంగా జరగాల న్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది గర్భణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ధన్‌రాజ్, ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ డా. దేవేందర్ రెడ్డి, డాక్టర్లు కార్తీక్, రజిని, ఆశిష్, వేణుగోపాల్, మాస్ మీడియా అధికారి రవీందర్, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సుభాష్, సరోజ, స్వర్ణరెడ్డి, లక్ష్మీచైతన్య అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి పనులు వేగవంతం చేయండి
నిర్మల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన స్మశాన వాటికలు, పంట కల్లాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్మశానవాటికలు, పంట కల్లాల నిర్మా ణాలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశిం చారు. ప్రభుత్వం జిల్లాకు 2527 కల్లాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఇప్పటి వరకు 916 పనులను ప్రారంభించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిర్మాణాల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. స్మశాన వాటికల ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పరిషత్ సీఈవో సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకరయ్య, ఎంపీడీవోలు, వ్యవసాయశాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.