అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

ABN , First Publish Date - 2020-03-04T12:49:11+05:30 IST

నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం మొగ్లి నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు ఓ ఆటోలు అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

తానూర్‌, మార్చి 3: నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం మొగ్లి నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు ఓ ఆటోలు అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను తానూర్‌ పోలీసులు పట్టుకున్నారు. తానూర్‌ ఎస్సై గుడిపెల్లి రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి ఓ ఆటోను తనిఖీ చేయగా అందులో టేకు కట్టెలు ఉండడంతో పోలీసు స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి, వాటిని ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని అంచనా వేశారు. అటవీ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా టేకు రవా ణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2020-03-04T12:49:11+05:30 IST